తెలంగాణలో వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి

-

తెలంగాణలో రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణలో వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి చెందారు. తెలంగాణలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 24 గంటల్లో ఎండ తీవ్రతకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

11 people die of heatstroke in Telangana in a single day

ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news