రచయితగా మారిన మంచు విష్ణు.. సక్సెస్ అందుకుంటాడా?

చాలా రోజుల తర్వాత మంచు విష్ణు హీరోగా సినిమా రిలీజ్ కాబోతుంది. మోసగాళ్ళు పేరుతో దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో భారీ లెవెల్లో రిలీజ్ కి అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మంచు విష్ణు పాల్గొంటున్నాడు. 2వేల కోట్ల స్కామ్ గురించి చూపించబోతున్న మంచు విష్ణు, ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసాడట. మోసగాళ్ళు సినిమాకి దర్శకత్వం చేసింది హాలీవుడ్ లో అసిస్టెంట్ గా పని చేసిన జెఫ్రీ గీ చిన్. ఆయనకిది మొదటి సినిమా. తెలుగు, ఇంగ్లీష్ వెర్షన్లలో సినిమాని తెరకెక్కించారు. ఇంగ్లీష్ వెర్షన్ ఇంకా రెడీ అవుతుంది.

ఐతే తెలుగు వెర్షన్ స్క్రిప్టు ముందు రెడీ చేసారు. దీనికోసం హీరో మంచు విష్ణు రంగంలోకి దిగాడు. రచయిత డైమండ్ రత్నబాబుతో కలిసి పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసి, ఆ తర్వాత ఇంగ్లీష్ డ్రాఫ్ట్ తయారు చేసారట. అంటే, తన సినిమాకి తానే రచయితగా పనిచేసాడన్న మాట. ఏదైతేనేం, ప్రస్తుతానికి సినిమాకి మంచి బజ్ ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అన్నింటికీ మించి మంచు విష్ణు నమ్మకంగా ఉన్నాడు. మరి ఆ నమ్మకం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.