మండు వేసవిలో ఆరోగ్యాన్నందించే అగ్ని టీ.. తయారు చేసుకోండిలా.

-

వేసవి తన ప్రతాపాన్ని మొదలు పెట్టింది. ఇప్పుడిప్పుడే చలిగాలుల తీవ్రత తగ్గి వేడి గాలులు ఊపందుకుంటున్నాయి. వాటితో పాటు శరీరంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులని తట్టుకుని నిలబడడానికి మనకి శక్తి అవసరం. ఇంటి బయట వేడి ఒంట్లో వేడిని ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు శరీరాన్ని చల్లబర్చుకుంటూ ఉండాలి. దానికోసం శరీరంలోని విష పదార్థాలని బయటకి పంపించివేయాల్సి ఉంటుంది. శరీరంలోని హాని చేసే పదార్థాలను బయటకి పంపించే అగ్ని టీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

అగ్ని టీ వలన కలిగే ప్రయోజనాలేంటో ముందుగా తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది.
శరీరంలోని ఏమైనా హాని చేసే పదార్థాలు ఉన్నట్లయితే వాటిని బయటకి పంపించి, మానసికంగా, శారీరకంగా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా బరువు తగ్గేలా చూస్తుంది.
శరీర సమతుల్యతలు కాపాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అగ్ని టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.

ఒక లీటరు మంచినీరు
ఒక చిన్నపాటి అల్లం ముక్క
1-2టేబుల్ స్పూన్ల రాతి ఉప్పు
2టేబుల్ స్పూన్ల బెల్లం

ఒక చిటికెడు కారపు మిరియాలు

తయారీ విధానం

అన్నింటినీ ఒక పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి 20నిమిషాల పాటు మరగబెట్టాలి. బాగా మరిగిన తర్వాత పొయ్యి మీద నుండి తీసివేసి చల్లారే వరకు పక్కన పెట్టాలి. కాస్త చల్లారగానే రెండు నిమ్మకాయల రసాన్ని అందులో కలపాలి. ఆ తర్వాత దాన్ని థర్మాస్ ఫ్లాస్క్ లో నింపుకుని రోజంతా మీకు కావాల్సినపుడు తాగుతూ ఉండండి. మండు వేసవిలో కడుపులో మండే వాటిని దూరం చేసుకోవడానికి ఇది సరైన పద్దతి.

Read more RELATED
Recommended to you

Latest news