ప్రభాస్‌ పై బాలీవుడ్‌ నటుడు కామెంట్స్‌..రంగంలోకి మంచు విష్ణు !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ పై బాలీవుడ్‌ నటుడు అర్షద్ వార్సి చేసిన కామెంట్స్‌ పై టాలీవుడ్‌ సీరియస్‌ అయింది. ప్రభాస్‌ పై బాలీవుడ్‌ నటుడు అర్షద్ వార్సి చేసిన కామెంట్స్‌ పై రంగంలోకి దిగారు మంచు విష్ణు. ఈ మేరకు సినీ అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఘాటుగా లేఖ రాశారు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.

Manchu Vishnu, the president of our association, has written a scathing letter to the Cine and TV Artist Association

ప్రభాస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి పై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. ఇటీవల ఓ ఇంటర్వూ లో ప్రభాస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అర్షద్ వార్సి. అర్షద్ వార్సి వ్యాఖ్యలు భాధించాయని పేర్కొన్న విష్ణు… బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి పై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. కాగా.. కల్కీ సినిమాలో ప్రభాస్‌ ఓ జోకర్‌ లాగా కనిపించాడని అర్షద్ వార్సి కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version