‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ సభ్యులు ఇకపై అవార్డుల ఫంక్షన్లలో ప్రదర్శనలు ఇస్తే అసోసియేషన్ వద్ద ఈవెంట్స్ మేనేజర్స్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ రూల్ తక్షణమే అమలులోకి వస్తుందని మంచు విష్ణు ప్రకటన చేశారు. అనుమతి లేకుండా పెర్ఫామ్ చేసిన నటీనటులకు పారితోషికం రాకపోతే ‘మా’ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.

కాగా, ప్రముఖ అవార్డు సంస్థ సైమా స్కాంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘మా’లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అవార్డు ఫంక్షన్ తనకు పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, తనకు న్యాయం జరిపించాలని ‘మా’ను ఆశ్రయించారు హీరోయిన్. ఇక ఆ హీరోయిన్ ఫిర్యాదుపై తాజాగా స్పందించిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు…. ‘మా’ సభ్యులు ఇకపై అవార్డుల ఫంక్షన్లలో ప్రదర్శనలు ఇస్తే అసోసియేషన్ వద్ద ఈవెంట్స్ మేనేజర్స్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.