పిఎం కిసాన్ పెంచడంపై కేంద్రం కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కౌలు దారులకు ఈ స్కీమ్ ను వర్తింపచేస్తారా అనే ప్రశ్నకు వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు.

కేవలం భూమిని కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు విస్తరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 20 విడతల్లో రూ. 3.9 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా…. పీఎం కిసాన్ నిధులను ప్రభుత్వం సంవత్సరానికి రూ. 6వేల చొప్పున రైతులకు అందిస్తోంది. వీటిని మూడు విడతలలో రూ. 2వేల చొప్పున మూడుసార్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.