మా సభ్యత్వంపై మంచు విష్ణు కీలక నిర్ణయం.. ఇకపై వారు కూడా..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక సరికొత్త నిర్ణయానికి నాంది పలికారు. ఇప్పటివరకు మా అసోసియేషన్ అనేది కేవలం తెలుగు నటీనటులకు మాత్రమే పరిమితం అయింది. అంతేకాదు మా సభ్యత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా తెలుగు నటీనటులకు మాత్రమే లభించేవి.. అయితే తాజాగా మా సభ్యత్వంపై మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలుగు చిత్రాలలో నటించే బాలీవుడ్ వారికి కూడా మా సభ్యత్వం లభించేలా వారికి మా అసోసియేషన్ నుంచి వచ్చే పథకాలు కూడా అందేలా సరికొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు మంచు విష్ణు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని కలిసి వారితో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇక అందులో భాగంగానే తాజాగా మా అసోసియేషన్, బాలీవుడ్ అసోసియేషన్ రెండూ కూడా ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. ఇక మంచు విష్ణు మాట్లాడుతూ..” మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు బాలీవుడ్ అసోసియేషన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలలో పనిచేసే బాలీవుడ్ కళాకారులకు కూడా మా సభ్యత్వం అందుతుంది. అలాగే తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తే వాళ్ళకి కూడా బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం లభిస్తుంది అని తెలిపారు.

ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు మా అసోసియేషన్ వాళ్లకు అండగా ఉంటుందని.. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా లభిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం ఒక బాలీవుడ్ కే పరిమితం కాదు అని.. త్వరలోనే మిగతా ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుందని ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబంలా ఉండాలనేదే తన కోరిక అంటూ మంచు విష్ణు తెలిపారు. ఏది ఏమైనా మంచు విష్ణు నిర్ణయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version