ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిజ్లో మనం ఎన్నో ఆహార పదార్థాలని పెడుతూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనం వాటిని చూసుకోక పోయినప్పుడు అవి కుళ్ళిపోయి దుర్వాసన ఫ్రిడ్జ్ నుండి వస్తుంది అయితే ఫ్రిజ్ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం…. చాలామంది ఇళ్లల్లో ఈ సమస్య కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సమస్య కనుక ఉంది అంటే ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు. మరి మీ ఫ్రిడ్జ్ కూడా దుర్వాసన వస్తున్నట్లయితే ఈ సులువైన చిట్కాలని వెంటనే పాటించండి. ఇలా ఈజీగా మనం ఫ్రీజ్ ని శుభ్రం చేసుకోవచ్చు. దుర్వాసన సమస్యకి చెక్ పెట్టొచ్చు.
ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం ఏదో ఒక రోజు మీరు ఫ్రీజ్ ని క్లీన్ చేస్తూ ఉండండి. క్లీన్ చేయడం మర్చిపోతే పాడైపోయిన వాటి నుండి దుర్వాసన వస్తుంది. క్లీన్ చేసేటప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకోండి. ఇంకో గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకోండి. ఫస్ట్ నిమ్మరసంలో స్పాంజిని ముంచి లోపల భాగాన్ని క్లీన్ చేస్తూ ఉండండి మరకలు ఉంటే నిమ్మ తొక్కని వెనిగర్లో నానబెట్టి మరక మీద రుద్దండి. తర్వాత సబ్బు నీళ్ల తో కడగండి రెండోసారి మంచినీటితో క్లీన్ చేయండి. ఇలా చేస్తే దుర్వాసన పోతుంది. ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉంటుంది.
నీళ్ళని మరిగించి కొంచెం వెనిగర్ వేసి చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో పోసి ఫ్రిడ్జ్ లోపల భాగంలో స్ప్రే చేయండి వెనిగర్ వేయడం వలన ఫ్రిడ్జ్ ఈజీగా క్లీన్ అవుతుంది. ఫ్రిజ్లో సాస్ వంటివి పడినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది చెడు వాసన మొత్తం పోతుంది చక్కగా మంచి వాసన వస్తుంది. బేకింగ్ సోడా ని కూడా మీరు ఉపయోగించవచ్చు. నిమ్మరసం బేకింగ్ సోడాని పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని ఫ్రిజ్లో వేసి క్లీన్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో క్లాత్ వేసి ఆ క్లాత్ తో క్లీన్ చేసుకోండి ఇలా మరకలు అన్నీ కూడా పోతాయి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే దుర్వాసన మొత్తం పోతుంది. ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉంటుంది.