Mangalavaaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘మంగళవారం’ మూవీ..!

-

క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’ ఓటీటీలోకి వచ్చేసింది. ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ వంటి సినిమాలతో టాలీవుడ్లో సందడి చేసిన భామ పాయల్ రాజ్పుత్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసును దోచేసింది ఈ భామ. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తాయని అంతా భావించినా అలా జరగలేదు. కానీ తన వద్దకు వచ్చిన ఛాన్స్లను మాత్రం ఈ భామ వదులుకోవడం లేదు.

Mangalavaaram Ott Release Date Out Directed Ajay Bhupathi

అలా ఇటీవల ఈ బ్యూటీ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మంగళవారం. అయితే..క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’ ఓటీటీలోకి వచ్చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కీలకపాత్రలో నటించారు. ఓ గ్రామంలో వరుసగా మంగళవారాల్లో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనే అంశాన్ని ఈ మూవీలో చూపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version