వెబ్ సిరీస్‌కా బాప్ అంటే ఇదే మ‌రి!

-

లాక్‌డౌన్ వ‌ల్ల వెబ్ సిరీస్‌ల హ‌వా మొద‌లైంది. క్రేజ్ కూడా భారీగా పెరిగింది. మారుతున్న కాలాన్ని బ‌ట్టి మ‌న‌మూ మారాల‌ని లెజెండ‌రీ డైరెక్ట‌ర్స్ మేక‌ర్స్ ముందుకొస్తున్నారు. థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో అంతా వెబ్‌సిరీస్‌ల బాట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్య‌లో వెబ్ సిరీస్ కా బాప్ రాబోతోంది. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్న్ం దీనికి శ్రీ‌కారం చుట్టారు.

180, నా నువ్వే చిత్రాల ద‌ర్శ‌కుడు జ‌యేంద్రతో క‌లిసి మ‌ణిర‌త్న్ నెట్‌ప్లిక్స్ కోసం `న‌వ‌ర‌స‌` పేరుతో ఓ మెగా వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 9 ఎపిసోడ్‌లకు గాను తొమ్మిది క‌థ‌ల్ని చెప్ప‌బోతున్నారు. ఈ తొమ్మిది క‌థ‌ల‌కు తొమ్మి ది మంది ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌బోతున్నారు. కేవీ ఆనంద్‌, గౌత‌మ్ మీన‌న్‌, బిజో నంబియార్‌, కార్తిక్ సుబ్బ‌రాజ్‌, పొన్‌రామ్‌, హాలిత ష‌లీమ్‌, కార్తీక్ న‌రేన్‌, ర‌తీంద్ర‌న్ ప్ర‌సాద్‌, అర‌వింద‌స్వామి డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

ఈ తొమ్మిది క‌థ‌ల్లో రేవ‌తి, సూర్య‌, అర‌వింద్ స్వామి, నిత్యామీన‌న్, పార్వ‌తీ తిరువోతు, ఐశ్వ‌ర్యా రాజేష్‌, పూర్ణ‌, రిత్విక‌, హీరో సిద్ధార్ధ్‌, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాష్‌రాజ్‌, శ‌ర‌వ‌ణ‌న్‌, అల‌గ‌మ్ పెరుమాల్‌, ప్ర‌స‌న్న‌, విక్రాంత్‌, సింహా, గౌత‌మ్ కార్తీక్‌, అశోక్ సెల్వ‌న్‌, రోబో శంక‌ర్‌, ర‌మేష్, తిల‌క్, స‌న‌త్‌, విధు, శ్రీ‌రామ్ న‌టిస్తున్నారు. ఏ. ఆర్ రెహ‌మాన్‌, జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌, డి. ఇమాన్‌, జిబ్రాన్‌, అరుల్‌దేవ్‌, కార్తిక్‌, రోన్ ఎత‌న్ యేవ‌న్‌, గోవింద్ వ‌సంత‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయి వెబ్ సిరీస్ ద‌క్షిణాది నుంచే కాకుండా ఇండియా వైడ్‌గా రాలేదు.. ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌లేదు కూడా. దీంతో ఈ వెబ్ సిరీస్‌ని వెబ్ సిరీస్‌కా బాప్ అనాల్సిందే. అయితే ఇది మొత్తం త‌మిళంలోనే రూపొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news