ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ వేషధారణ ఇప్పుడు అనేక వివాదాలకి కేంద్ర బిందువు అవుతోంది. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కు ముస్లిం గెటప్ లో చూపడం రచ్చ రేపుతోంది. ఈ అంశం మీద నిన్ననే బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా చరిత్రను వక్రీకరిస్తే థియేటర్లను తగలబెడతారని ఆయన అన్నారు. ఇక ఇదే అంశం మీద ఆయన మళ్ళీ కామెంట్స్ చేశారు.
ఓ ప్రముఖ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో కొమరం భీమ్ ను కించపరిచే విధంగా చిత్రీకరించారని అన్నారు. కొమరం భీమ్ తలపై ఒక మతానికి చెందిన టోపీ పెట్టారని, కళ్ళలో శుర్మా పెట్టారని అన్నారు. చరిత్రలో ఎన్నడూ కొమరం భీమ్ ఆ వేషధారణలో లేరని అయన అన్నారు. ఇది ఆదివాసీలను కించపరిచేలా చిత్రికరిస్తున్నారన్న ఆయన రాజమౌళి విడుదల చేసిన టీజర్ చూశాక రాజమౌళితో మాట్లాడేందుకు ప్రయత్నం చేశానని కానీ ఆయన అందుబాటులోకి రాలేదని అన్నారు. రాజమౌళికి ఇదే నా హెచ్చరిక ఇలాగే మొండిగా సినిమా విడుదల చేస్తే…థియేటర్ లపై ఆదివాసీలు దాడులు చేస్తార ని ఆయన అన్నారు.