మ‌హేష్ అక్క హీరోయిన్ అంటే ఫ్యాన్స్ ఆత్మ‌హ‌త్యే!

-

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని మంజుల టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలి త‌న ప్ర‌తిభ‌ను చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. న‌టిగా స‌క్సెస్ కాలేదు. ద‌ర్శ‌కురాలిగాను రాణించ‌లేదు. కానీ నిర్మాత‌గా మాత్రం పోకిరి, ఏమాయ చేసేవే లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లను అందించింది. న‌టిగా ఫెయిల‌వ్వ‌డంతో ద‌ర్శ‌కురాలిగా నిల‌దొక్కుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేసింది. కానీ క‌లిసి రాలేదు. మ‌న‌సుకు న‌చ్చింది చిత్రాన్ని తెర‌కెక్కిందింది. కానీ ఆ సినిమా చూసిన ప్రేక్షకుడు లేకపోగా విమ‌ర్శ‌లు ఎదుర్కోంది. అయినా స‌క్సెస్ , ఫెయిల్యూర్స్ మ‌న చేతుల్లో ఉండ‌వ‌ని తెలుసుకుని అప్ప‌టి నుంచి కామ్ అయిపోయింది.

Manjula Ghattamaneni Reveals Unknown Facts about Her

అయితే వీట‌న్నింటికంటే ముందే 1994లోఆమె హీరోయిన్ అవ్వాల‌నుకుందిట‌. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఎస్వీ కీష్ణా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌ని `టాప్ హీరో` అనే సినిమాలో ముందుగా మంజుల‌నే హీరోయిన్ గా అనుకున్నారుట‌. కానీ కృష్ణ అభిమానులు మంజుల హీరోయిన్ అయితే ఆయ‌న ఇంటి ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని హెచ్చ‌రించారుట‌. మొద‌ట ఈ రూమ‌ర్ వినిపించ‌గానే న‌ల్ల ముసుగులు ధ‌రించి, పెట్రోలు కేన‌లు తీసుకుని స్టూడియో ముందుకు అభిమానులు త‌ర‌లి వ‌చ్చారుట‌. దీంతో కృష్ణ స్పందించి మంజుల హీరోయిన్ అవ్వ‌ద‌ని ప్ర‌క‌ట‌న చేసారుట‌. దీంతో కొన్నాళ్ల పాటు మంజులు ఎక్క‌డా క‌నిపించలేదుట‌. త‌ర్వాత మంజ‌లు `షో`, కావ‌యాస్ డైరీ, ఆరెంజ్ , చిత్రాల్లో న‌టించారు.

అయితే ఆ సినిమాల‌న్నీ వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు కావ‌డంతో ఏ అభిమాని రియాక్ట్ కాలేదు. ఆ సినిమాలు కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో మంజుల న‌టి అన్న విష‌యం కూడా కొంత మందికి స‌రిగ్గా తెలియ‌దు. ఈ విష‌యాల‌న్నీ మంజుల ఓ ఇంట‌ర్వూలో వెల్ల‌డించింది. అయితే అభిమానులు ఆమెను హీరోయిన్ గా ఎందుకు ఒప్పుకో లేదో మాత్రం రివీల్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం మంజ‌ల కుటుంబానికే ప‌రిమిత‌మైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version