టాలీవుడ్ నటి మన్నారా చోప్రా బాలీవుడ్ బిగ్బాస్-17 హౌస్లోకి కంటెస్టెంట్గా వెళ్లింది. అయితే అక్కడ ఈ బ్యూటీ ఇటీవల తనపై వచ్చిన కాంట్రవర్సీ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే డైరెక్టర్ రవికుమార్ మన్నరాను ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు అప్పుడే క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే హిందీ బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన మన్నారా ఈ వివాదంపై మరోసారి స్పందించింది.
“దర్శకుడు రవికుమార్ చాలా రోజుల తర్వాత నన్ను చూడడంతో ఆనందంతో అలా ముద్దు పెట్టారు. మేము స్నేహితుల్లా ఉంటాం. నాకు రవికుమార్ తండ్రితో సమానం. ‘‘తిరగబడరా సామి’ సినిమా ప్రమోషన్స్ ఊహించని మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పటికే దీని గురించి చాలా సార్లు చెప్పాను. ఆయనకు నేను చిన్న పిల్లతో సమానం. అందుకే అలా ముద్దు పెట్టారు. దీని గురించి ఇంతకంటే మాట్లాడడానికి సిద్ధంగా లేను’’ అని మన్నారా చోప్రా మరోసారి క్లారిటీ ఇచ్చింది.
వికుమార్ తాజాగా ‘తిరగబడర సామి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు.