కోలీవుడ్ బ్యూటీ త్రిష – నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. త్రిషపై మన్సూర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై యావత్ ఇండియన్ ఫిల్స్ ఇండస్ట్రీ తీవ్రంగా మండిపడుతోంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ భామకు అండగా నిలిస్తూ.. మన్సూర్ అలీఖాన్ ప్రవర్తనను ఖండిస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా.. మన్సూర్ మాత్రం తన తప్పేం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని సమర్థించుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా ఈ విషయంలో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తనేంటో తమిళ ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందని మన్సూర్ అన్నాడు.
మరోవైపు మన్సూర్ అనుచితంగా వ్యాఖ్యలపై స్పందించిన దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) ఆయన్ను పాక్షికంగా నిషేధించింది. త్రిషకు క్షమాపణ చెబితే బ్యాన్ తొలగిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన మన్సూర్ నడిగర్ సంఘం తప్పు చేసిందని.. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు వివరణ అడగాలి కానీ వారు అలా చేయలేదని మండిపడ్డాడు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని నడిగర్ సంఘాన్ని డిమాండ్ చేశాడు.