తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను మంచి చేసుకునేందుకు రకరకాల హామీలను ఇస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ తమ తమ అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
మంచిర్యాల లోని చెన్నూర్ అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకవైపు గోదావరి గలగలలతో, మరోవైపు సింగరేణితో ఉంటుంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ కు అడ్డాగా మారింది. చెన్నూర్ నుంచి బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. బాల్క సుమన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నా, ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలతో ఈసారి విజయం సాధించాలని బాల్క సుమన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామికి ఈసారి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు, బాల్క సుమన్ చేసిన అవినీతి ఆరోపణలను ప్రజల ముందుకు తీసుకు వెళుతూ వివేక్ వెంకటస్వామి ఈసారి కచ్చితంగా గెలుస్తానని చెబుతున్నారు. బిజెపి దుర్గం అశోక్ టికెట్ ఇచ్చారు. కానీ చెన్నూర్ లో బాల్క సుమన్ కు, వివేక్ వెంకటస్వామి మధ్య మాత్రమే పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి బిఆర్ఎస్ చేసిన అభివృద్ధికి చెన్నూర్ ప్రజలు ఓటేస్తారా ???? లేక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల వైపు చూస్తారా???? వేచి చూడాల్సిందే…