లూసీఫ‌ర్ కోసం మెగాప్లాన్‌.. బ్ర‌ద‌ర్ కొడుకుతో చిరంజీవి

-

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంతో యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. వ‌రుస‌పెట్టి పెద్ద డైరెక్ట‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్నారు. ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే మ‌రో సినిమాకు ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పుడు కొర‌టాల సినిమా ఆచార్య‌లో న‌టిస్తూనే లూసీఫ‌ర్ (Lucifer) రీమేక్‌పై దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం భారీ ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఆచ‌ర్య మూవీ షూటింగ్ వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌పై దృష్టి పెట్టారు. చకచక ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడు మెగాస్టార్‌. ఇప్పుడు ఇందులో మ‌రో హీరో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరో చిరంజీవికి త‌మ్ముడి పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. ఈ పాత్రలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను మేక‌ర్స్ తీసుకోవాల‌ని చూస్తున్నారంట‌. మెగాస్టార్‌ సినిమాలో ఏ పాత్ర చేయడానికైనా మెగా హీరోలు రెడీగా ఉంటార‌ని తెలిసిందే. ఇక ఈ పాత్ర కూడా ఇంపార్టెంట్ కావ‌డంతో వరుణ్ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడని మెగా అభిమానులు అంచ‌నా వేసుకుంటున్నారు. ఆగస్టు 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా లూసిఫర్‌ను లాంచ్ చేస్తారు. దీనికి మోహన్ రాజా ఈ మూవీకి దర్శకుడిగా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version