జాను దెబ్బకి జడుస్తున్న మెగాస్టార్ …?

సమంత శర్వానంద్ నటించిన సినిమా జాను. కోలీవుడ్ లో మంచి విజయం అందుకున్న 96 కి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అక్కడ ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇక్కడ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. సమంత క్రేజ్ మొత్తం ఒక్క దెబ్బతో ఊడ్చుకొని పోగా శర్వానంద్ కి కోలుకోలేని దెబ్బ పడింది. ప్రస్తుతం ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజు కూడా బాగా నష్ఠపోయారట. ఇక మళ్ళి పొరపాటున కూడా ఇలాంటి కథలని తీసుకొని రీమేక్ చేయనని అటు దిల్ రాజు ఇటు సమంత డిసైడయ్యారట.

 

ఇక జాను తమిళ 96 రీమేక్ అన్న ప్రచారంతో పాటు.. ఆన్ లైన్ లో ఈ సినిమా అందుబాటులో ఉండటం.. అమెజాన్ లోనూ ఉండటంతో.. ఈ సినిమాను తమిళ్ వెర్షన్ అయినా కూడా ప్రేక్షకులు బాగా చూశారు. ఇలా చూసిన సినిమాను మళ్లీ థియోటర్స్ వరకు వెళ్ళి ఏం చూస్తాము లే అనుకొని చాలామంది జాను సినిమాకి వెళ్ళకుండా ఆగిపోయారట. అది పెద్ద మైనస్ గా మారింది.

ఇక తాజాగా వినిపి స్తున్న మాటేమిటంటే మెగాస్టార్ నటిస్తారని గత కొంతకొంతకాలంగా ప్రచారం జరుగుతున్న లూసిఫర్ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా..! అని ఇప్పుడు మెగా అభిమానుల్లో పెద్ద సందేహంగా గా మారిందట. 96 తెలుగులో డబ్ చేయలేదన్న సంగతి తెలిసిందే. అందుకే దిల్ రాజు 96 ని రైట్స్ కొనుక్కొని జాను గా రీమేక్ చేశారు. కానీ మలయాళలో సూపర్ హిట్టైన లూసిఫర్ ను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తెలుగులో ఏ ఒక్కరు ఆసక్తి చూపించలేదు.

అందుకే ఇప్పుడు మెగాస్టార్ లూసీఫర్ సినిమాలో తను నటించాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారట. అసలు ఇలాంటి సినిమాని సైలెంట్ గా వదిలేయడమె బెటర్ అని అనుకుంటున్నారట. అందులో భాగంగానే జాను లా ఈ సినిమా రీమేక్ చేస్తే ఫ్లాపవుతుందేమేనని డైలమాలో పడ్డారట మెగాస్టార్.