మెగాస్టార్ చిరంజీవి హీరో కాదు దేవుడు అంటున్న ప్రముఖ విలన్.. ఏమైందంటే..?

-

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో.. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దమనసు చాటుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. తాజాగా చిరంజీవి చేసిన ఒక పనికి ప్రముఖ విలన్… ఆయన ఒక హీరో కాదు.. దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే తమిళం నటుడు పొన్నాంబళం గత కొద్ది కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పొన్నాంబళం తనకి ఆర్థిక సహాయం అందించాలని కూడా గతంలో విజ్ఞప్తి చేశాడు.ఆయనకు పలువురు ఆర్థిక సహాయం అందించినప్పటికీ కూడా అది అతడి వైద్య ఖర్చులకు ఏమాత్రం సరిపోలేదు.

కానీ ఇప్పుడు పొన్నాంబళం పూర్తిగా కోలుకొని నార్మల్ అయ్యారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే తనకు వైద్యం అందింది అని, ఆయన చేసిన సహాయాన్ని జీవితాంతం మరచిపోలేనని పొన్నాంబళం తెలిపారు..తన స్నేహితుడి ద్వారా పొన్నాంబళం చిరంజీవి ఫోన్ నెంబర్ తీసుకున్నారట. అన్నయ్య నేను పొన్నాంబళం.. నా ఆరోగ్యం బాగాలేదు.. వీలైన సహాయం చేయండి .. అని మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేశారట.. 10 నిమిషాల తర్వాత అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది.. ఆరోగ్యం బాగాలేదా.. హైదరాబాద్ కి రాగలవా.. వైద్యం చేయిస్తాను అని అడిగారట.. నేను రాలేను పరిస్థితుల్లో ఉన్నాను.. అని పొన్నాంబళం చెబితే.. అయితే వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్ళు.. మొత్తం నేను చూసుకుంటానని చెప్పారట.

పొన్నాంబళం ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ ఎంట్రీ ఫీజు కూడా అడగలేదని.. మొత్తం వాళ్లే చూసుకున్నారని.. వైద్యానికి రూ.45 లక్షల ఖర్చు అయింది.. అంతా చిరంజీవి అన్నయ్య భరించారు అంటూ పొన్నాంబలం ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసన గారిదే ఆ ఆసుపత్రి కావడంతో నన్ను ఇంకా బాగా చూసుకున్నారు అంటూ ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version