యుఎస్ఏ కలెక్షన్స్ లో అదరగొడుతున్న మెగాస్టార్.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు .

మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయని గాట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కూడా వసూళ్ళు వర్షం కురిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఫీట్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత మంచి మార్కెట్ గా చెప్పుకొనే యుఎస్ఏ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే యూ ఎస్ లో వన్ మిలియన్ మార్కును అధిగమించింది. సోమవారం నాటికి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1.9 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించి రెండో మిలియన్ డాలర్ల కు అడుగు దూరం లో నిలిచింది.  ఇక ఈ మార్కెట్ లోమెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా నరసింహా రెడ్డి, 2.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్ లో ఉంది. అయితే ఇదే ట్రెండ్ కొనసాగితే, వాల్తేరు వీరయ్య ఖచ్చితంగా టాప్ కి వెళుతుందని రికార్డ్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version