నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

-

తెలుగు రాష్ట్రాల‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మరోవైపు గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు ప‌లువురు సినీ సెలబ్రిటీలు. ఈ క్ర‌మంలోనే తెలుగు ప్రజలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు సినీ ప్రియులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ ఓ స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.

2023 తెలుగు సినీ పరిశ్రమకు, ఇండియన్ సినిమాకు హిస్ట‌రిక‌ల్ ఇయ‌ర్‌గా చెప్పుకోవచ్చు. తెలుగు ఇండ‌స్ట్రీ గ‌త ఏడాదిలో ఎన్నో ఘ‌న‌త‌ల‌ను అందుకుంది. ఆస్కార్‌లు, గోల్డెన గ్లోబ్‌లు, జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇలా చెప్పుకుంటే ఎన్నో విజయాలు అందుకున్నాము. వైవిధ్యమైన కథా చిత్రాలతో సరిహద్దులను దాటాము. 2023లో సాధించిన విజయాలు, పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచపటంలో నిలిచిపోయింది. మన స్థాయి పెద్దది, మరిన్ని మంచి విషయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. గుడ్ బై 2023. 2024కి స్వాగతం. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటూ చిరు రాసుకోచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news