పరదా చాటున పరువపు అందాలు పర్చిన మేఘా..

సినిమా ఇండస్ట్రీలో కెరీర్ నిలబెట్టుకోవాలంటే సక్సెస్ కావాలి. హీరో అయినా, హీరోయిన్ అయినా, దర్శకుడైనా, క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా ఎవ్వరైనా సినిమా సక్సెస్ అయితేనే కెరీర్ ముందుకు నడుస్తుంది. లేదంటే అక్కడే ఆగిపోతుంది. ఐతే సక్సెస్ రావాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. కొంచెమైనా అదృష్టం ఉండాలి. గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే కాదు ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి అనే సామెత ఇక్కడ బాగా వర్తిస్తుంది.

అలా టాలెంట్ ఉండి కూడా సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోలేకపోతున్న భామ.. మేఘా ఆకాష్.. తమిళ అమ్మాయైన మేఘా ఆకాష్ తెలుగులో లై సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందాల రాక్షసి ఫేమ్ హనురాఘవపూడి తెరకెక్కించాడు. ఐతే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాకపోతే ఈ సినిమాలో మేఘా నటనకి మంచి ప్రశంసలే దక్కాయి.

ఆ తర్వాత మళ్ళీ నితిన్ తోనే ఛల్ మోహనరంగ చిత్రంలో కనిపించింది. ఇది కూడా ఆమెకి విజయాన్ని అందించలేకపోయింది. ఇటు తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్న మేఘా, రజనీకాంత్ పేట సినిమాలో నటించింది. ఆ తర్వాత గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన తూటా సినిమాలో కనిపించింది. ఐతే ఈ చిత్రాలేవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఫలితం చూపించలేదు.

ప్రస్తుతం తెలుగు, తమిళం , హిందీ చిత్రాలని లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్ లో ఉంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలని షేర్ చేసింది. చీరలో మేఘా ఆకాష్ మరింత అందంగా కనిపిస్తుంది. పరదా చాటునుండి చూస్తున్న మేఘా, తన అందాలని కొసరి కొసరి వండిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నీలిరంగు చీరలో నిగనిగ మెరిసిపోతూ అభిమానులని ముచ్చటపర్చింది. ఓసారి మీరూ లుక్కేయండి.