నెల తిరగకుండానే ఓటీటీలోకి ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

-

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ కలిసి నటించిన సినిమా మెర్రీ క్రిస్మస్. ఈ లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా కలెక్షన్లలో జోరు చూపించలేకపోయింది. అయినా మిక్స్డ్ టాక్తో థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 60 కోట్ల‌కు కొనుగోలు చేసుకుందట. థియేట‌ర్ల‌లో విడుదలైన నాలుగు నుంచి ఐదు వారాల త‌ర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అలా చూసుకుంటే ఫిబ్ర‌వ‌రి 9 లేదా 16వ తేదీ నుంచి మెర్రీ క్రిస్మ‌స్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. ఇక త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news