మిల్క్ బ్యూటీ తమన్నా ఆస్తులు పెరిగినట్టేనా..?

-

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా మంచి హోదాలో ఉండే ఈమె ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తన క్రేజ్ ఏమాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. ఇక కుర్ర హీరోయిన్లతో కూడా పోటీ పడుతూ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతకు ఈ అమ్మడు అక్షరాల సరిపోతుందని చెప్పాలి. చక్కగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ భారీగా సంపాదిస్తోందని చెప్పవచ్చు. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆస్తులు మరింత పెరిగాయి అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సాధారణంగా హీరోయిన్ పాత్రకు ఒకరకమైన పారితోషకం తీసుకుంటే వెబ్ సిరీస్లలో బోల్డ్ క్యారెక్టర్ పోషిస్తున్నందుకు అందుకు భిన్నంగా రెట్టింపు స్థాయిలో పారితోషకం తీసుకుంటుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమన్నా ఆస్తులు పెరిగినట్లే అన్న వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం తమన్నా ఆస్తుల విలువ సుమారుగా రూ .160 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాదు ప్రతినెల యాడ్ ల ద్వారా 2 కోట్ల రూపాయలను సంపాదిస్తోందని.. ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల వరకు పారితోషకం అందుకుంటుందని సమాచారం.

అంతే కాదు పలు ప్రకటనల్లో కూడా నటిస్తున్న ఈమె వాటి నుంచి కూడా రూ.3 కోట్లు ఒక్కొక్క యాడ్ కి తీసుకుంటుందని సమాచారం. ఇక వెబ్ సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరొకవైపు వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక ఆన్లైన్ జ్యువెలరీ స్టోర్ ని కూడా నడిపిస్తోంది. ముంబైలోని వర్సోవ ఏరియాలో రూ.20 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్ తో పాటు బీఎండబ్ల్యూ , మెర్సిడెస్ బెంజ్ , రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు కూడా వున్నాయి. మొత్తానికి అయితే బాగానే ఈమె ఆస్తులు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news