ఏపీ ప్రజల బాగు కోసం… చతుర్వేద హవనం చేపట్టింది టీటీడీ పాలకమండలి. ఈ సందర్భంగా టిటిడి ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ… టిటిడి ఆద్వర్యంలో లోక కళ్యాణం కోసం చతుర్వేద హవనం వైభవంగా ప్రారంభైందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ… సకల సంవృద్దిగా, ఆయు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని చతుర్వేద హవనం టిటిడి చేపట్టిందని వివరించారు.
తిరుపతిలో మొదటి సారిగా ఈ చతుర్వేద హవనం నేటి నుంచి జూలై 5వ తేది వరకు జరుగుతుందని వివరించారు. నాలుగు వేదాలలోని మంత్రాలను 32 మంది రుత్వికులు పాటిస్తూ హోమం అన్నారు. ప్రపంచంలోని అన్ని జీవరాశులు, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని హోమాలు చేస్తున్నామని టిటిడి ఈవో ధర్మారెడ్డి చెప్పారు. హోమం ప్రాంగణంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నారు టిటిడి ఈవో ధర్మారెడ్డి.