పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ఇవాళ యూసూఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విచ్చేసి కొత్త ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను ఆహ్వానించడం సంతోషకరం అన్నారు. పవన్ కల్యాన్ పిలవగానే నేను నా సోదరుడు పిలిచాడని వెంటనే వచ్చాను. ఒక రాజకీయ నాయకుడిగా కాదు.. సోదర భావంతో వచ్చానని తెలిపారు. సూపర్ స్టార్స్ చాలా మంది ఉంటారు కానీ పవన్ కల్యాన్ లాంటి మంచి మనసున్న నటుడు చాలా తక్కువ మంది ఉంటారు.
ముఖ్యంగా పవన్ విలక్షణ నటుడు అని కొనియాడారు కేటీఆర్. దర్శకుడు సాగర్ కే చంద్ర నల్లగొండ నుంచి బయలు దేరి పవన్ కల్యాణ్ సినిమాకు డైరెక్టర్‌గా ఎదగడం చాలా గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. భీమ్లానాయక్ సినిమా ఎంతో మంది అజ్ఞాత సూరులను వెలుగులోకి తీసుకొచ్చిందని తెలిపారు. మొగులయ్య, దుర్గాబాయ్ తదితరులను బయటికి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల అయినటువంటి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను ఇవాళ కేసీఆర్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో కూడా పలు సినిమా షూటింగ్‌లు చేపట్టాలని కోరారు కేటీఆర్. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. భారతీయ చలన చిత్ర కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.