జాతీయ నటిగా అవార్డు గెలుచుకున్నా ఆ మాత్రం అటెన్షన్ క్రియేట్ చేయరా..?

-

థియేటర్లు మూసి ఉన్న కారణంగా సినిమాలన్నీ ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీ ద్వారా పలకరించాయి. లాక్డౌన్ టైమ్ లో కీరి సురేష్ నటించిన పెంగ్విన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎంతలా బజ్ క్రియేట్ అయ్యిందో అందరూ చూసారు. ఓటీటీలో రిలీజైన పెద్ద చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అంతగా రెస్పాన్స్ రాలేదు. అదలా ఉంచితే తాజాగా కీర్తి నటించిన మరో చిత్రం మిస్ ఇండియా నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నవంబర్ 4వ తేదీన అందుబాటులో ఉండనున్న ఈ చిత్రానికి కనీస ప్రచారం దక్కడం లేదు. పెంగ్విన్ చిత్రం రిలీజ్ అవుతోందంటే ఎందరో ఎదురుచూసారు. అదే మిస్ ఇండియా చిత్రం రిలీజ్ అవుతుందని చాలామందికి తెలియదు. జాతీయ నటిగా అవార్డు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రానికి కనీస ప్రచారం చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇదంతా చిత్రబృందం చేసే తప్పిదమా.. లేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేస్తున్నదా వారికే తెలియాలి.

ఐతే సినిమాకి ప్రచారం కల్పించకపోవడం వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వారికి గానీ నిర్మాతలకి గానీ నష్టం ఉంటుందో లేదో తెలియదు గానీ కీర్తి సురేష్ కి మాత్రం నష్టమే..

Read more RELATED
Recommended to you

Latest news