దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు చాణక్య భూమిగా మారింది..టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..ఈ దుబ్బాక ఉప ఎన్నిక ఏకపక్షం అనుకున్న..ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా వ్యవహరించడంతో అధికార టీఆర్ఎస్కు వణుకుపుట్టిస్తున్నాయి..కరోనాను కూడా లెక్క చేయకుండా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా ..
సాయంత్రం ఆరు గంటల వరకూ..పోలింగ్ ముసిగిసే సమయానికి 82 శాతం దాటడంతో ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది.. టీర్ఎస్ పార్టీ అభ్యర్థి రామలింగాడ్డి కుటుంబాన్ని వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? లేక టీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఇంతలా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించున్నారా?.. లేకపోతే కేంద్రం నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలపై తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దుబ్బాక ప్రజలు తమ వ్యతిరేఖతను ఓట్ల రూపంలో ప్రకటించారా అనేది ఇప్పడు అన్ని పార్టీల్లో ఉత్కంఠకు దారి తీశాయి..
మొదట్లో టీఆర్ఎస్ అంతర్గత సర్వేలలో రామలింగారెడ్డి కుటుంబం పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం..మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో ఓటింగ్‌కు రెండు రోజుల ముందు టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకపై ఎక్కువ ఫోకస్ పెట్టనట్లు ఎన్నికల ప్రచార శైలిని చూస్తే అర్థం అవుతుంది..మరో వైపు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి మారినట్లు ఎన్నికల సరళిలో కన్పిస్తుంది..బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎక్కువ దృష్టి సారించి వారి విమర్శలను వివరాలతో ప్రజల ముందు పెట్టడంతో బీజేపీ చేసిన అసత్యాప్రచారాలపై ప్రజలు ఆగ్రహంతో ఓట్ల రూపంలో షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పోలింగ్ సరళిని చూస్తే అర్థం అవుతుంది.
కరోనా లాక్ డౌన్ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు..ముఖ్యంగా ఈ రోజు జరిగిన పోలింగ్‌లో ఎక్కువ శాతం 50 ఏళ్ళ పైబడిన వారు క్యూలైన్లో అధికంగా కనిపించారు.. వారు తమ ఓటు హక్కును ఇంతలా ఉపయోగించున్నట్లు గతం ఎప్పుడు కనిపించలేదు.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా పథకాలు వీరిని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నవే.. రైతు బంధు, ఫించన్లు, కార్యకర్తలకు బీమా, ధరణి మ్యూటెషన్, రైతు వేదికల నిర్మాణం ప్రారంభోత్సవంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓటర్లు ప్రభావితం అయ్యినట్లు కన్పిస్తుంది..కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు.. కేసీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానంతో రైతుల్లో ఒక నమ్మకం ఏర్పాడినట్లు ఓట్ల సరళి ప్రతిబింబిస్తుంది.. ఇంకా ఇతర అనేక సంక్షేమ పథకాలు గ్రామిణ ప్రాంత ప్రజలను ఆకర్శించినట్లు తెలుస్తుంది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ సారి దుబ్బాక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనట్లు తెలుస్తుంది..కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు దానికి మైనస్ గా మారింది..గతంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా వచ్చేలా కనిపించడం లేదు..కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్‌ను బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది.. మొత్తం ఈ ఎన్నికలో బీజేపీ తన ఓటు శాతాన్ని పెంచుకునేలా ఉంది.. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు మరింత పెంచుకునే ప్రయత్నం చేసింది.
పెరిగిన ఓటు శాతం ఇప్పుడు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రెండు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్ , బీజేపీ మధ్య పోటీ హీట్ ను పెంచింది.. చరిత్రలో ఏ ఉప ఎన్నికలు చూసుకున్న అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..అధికార వర్గం, అభివృద్ధి మంత్రం వంటి ఎన్నికల అస్త్రాలు సహజంగా అధికార పార్టీలో ఉంటాయి కనుక ఈ సారి కూడా అదే పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఇప్పుడు పోలింగ్ శాతం పెరగడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. పెరిగిన ఓటింగ్ శాతం టీఆర్ఎస్ బీజేపీలో ఎవరికి అనూకూలంగా మారుంతి అనేది చర్చనీయంశగా మారింది.. పెగిరిన ఓటు షేర్ ఈ సారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెజార్టీని గతంలో కంటే మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.