“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

-

అనుష్క – నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా, కామెడీ ప్రధానమైన కథాంశంతో కొనసాగుతుంది. చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన సినిమా కావడం వలన, ఆమె అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు.

Miss Shetty Mr Polishetty OTT Release Date
Miss Shetty Mr Polishetty OTT Release Date

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ‘కృష్ణాష్టమి’ సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల అయి.. బంపర్‌ విజయాన్ని అందుకుంది. అయితే.. అయితే.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీలోకి రానుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అక్టోబర్ 5 నుండి OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news