మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

-

సయ్యద్ సోహైల్ ర్యాన్ హీరోగా.. రూప కొడువాయుర్ హీరోయిన్ గా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. రాజా రవీంద్ర , ఆలీ, బ్రహ్మాజీ ,వైవా హర్ష , అభిషేక్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన పొందుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గౌతమ్ (హీరో )అనాధగానే పెరుగుతాడు..ఆ తర్వాత టాటూ ఆర్టిస్ట్ గా పని చేస్తూ తనకు నచ్చినట్టుగా జీవించే గౌతమ్ జీవితంలోకి మహి(హీరోయిన్ )వస్తుంది.

మొదట మహి ప్రేమను రిజెక్ట్ చేస్తాడు గౌతమ్.. అయినా కూడా మహి పట్టు వదలకుండా గౌతమ్ వెంట పడుతుంది. ఒక దశలో కొన్ని షరతులు పెట్టి మహీ ప్రేమను గౌతమ్ అంగీకరిస్తాడు. కానీ ఆమె ప్రేమను ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు. దాంతో తల్లిదండ్రులను ఎదిరించి గౌతమ్ తో ఏడడుగులు వేస్తుంది మహి. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భవతి కావడంతో మహీని దూరం పెడతాడు గౌతమ్. ఆ తర్వాత మనసు మార్చుకొని ఆమె గర్భాన్ని తన కడుపులో పెంచుకోవడానికి గౌతమ్ నిర్ణయం తీసుకుంటాడు. అయితే ప్రకృతికి విరుద్ధంగా భార్య మహి గర్భాన్ని గౌతమ్ ఎందుకు మోయాలని అనుకుంటాడు..గౌతమ్ గర్భాన్ని మోసే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. సమాజం పెట్టిన ఇబ్బందులను ఎలా ఎదిరించాడు.. అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

మొదటి భాగం భావోద్వేగ అంశాలు, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను దర్శకుడు ఎమోషనల్ గా రాసుకున్న తీరు అందర్నీ ఆకట్టుకునేలా చేసింది. ఇక రెండవ భాగం కూడా మంచి వినోదంతో కడుపుబ్బా నవ్వించిన తీరు స్క్రిప్ట్ పై ఆయనకున్న గ్రిప్ ను తెలియజేసింది. మొత్తానికి అయితే ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా వినూత్నంగా తెరపైకి రావడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version