రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు స్థానాలే- RRR

-

రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు స్థానాలేనని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా ఒక ఆంగ్ల దినపత్రిక సర్వే ఫలితాలను వెల్లడించిందని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను, 24 స్థానాలను ప్రస్తుతం తన పార్టీ గెలుస్తుందని తన సర్వే లో పేర్కొందని, కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి నాలుగు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని అన్నారు.

సదరు ఆంగ్ల దినపత్రికకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రెవిన్యూ ఇస్తున్నందుకే, ఇటువంటి తప్పుడు సర్వేలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ఈ సర్వేల ఆధారంగా కేంద్రంలోని బీజేపీ పార్టీని, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోకుండా చూడాలని ఎత్తుగడ వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి సామాన్యుడిని ప్రశ్నించినా తమ ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిడుతున్నారని, వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, దానికి భిన్నంగా సర్వే ఫలితాలు వెల్లడించడం ఆశ్చర్యకరంగా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version