తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ఇస్తూ… రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. 24వ తేదీన క్రిస్మస్ ఈవ్, 25వ తేదీన క్రిస్మస్ పండుగ ఉండనుంది.
26వ తేదీన బాక్సింగ్ డే పండుగ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూడు రోజులు సెలవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో క్రిస్మస్ పండుగకు ఐదు రోజులపాటు సెలవులు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం క్రిస్మస్ సెలవులను మూడు రోజులకు కుదించడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24, 26 తేదీలలో ఆప్షన్ హాలిడే, 25వ తేదీన జనరల్ హాలిడే గా డిక్లేర్ చేసింది చంద్రబాబు సర్కార్.