వంద కోట్లతో మోహన్ బాబు కొత్త మూవీ.. స్టోరీ కూడా చెప్పేశాడు

-

ఒకప్పుడు కలెక్షన్ కింగ్​గా పేరు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. కానీ గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న.. నిర్మిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కేవలం ఆయనకే కాదు.. మంచు ఫ్యామిలీకే సినిమాలు కలిసిరావడం లేదు. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ.. ఇలా వారసుల సినీ కెరీర్​లు కూడా గాడితప్పాయి. ఇక ఇటీవలే మంచు విష్ణు జిన్నా సినిమాతో వచ్చాడు.

కానీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. మంచు మనోజ్ కెమెరా ముందుకు వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ప్రకటించాడు. మరి ఈ హీరో ఫేట్ ఎలా ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. మంచు లక్ష్మి అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నా.. ఒక్క స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమా పడట్లేదు ఆమెకు. ఇక సన్ ఆఫ్ ఇండియాతో భారీ నష్టాన్ని.. నెగిటివిటీని మూటగట్టుకున్న మోహన్ బాబు తన తదుపరి సినిమాను ప్రకటించారు.

వంద కోట్ల సినిమాను ప్రకటించి అందరనీ షాక్ కు గురిచేశారు. మంచు విష్ణు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఈ సినిమా ప్లాట్ ను కూడా మోహన్ బాబు ముందే చెప్పేయడం విశేషం. మోహన్ బాబు యూనివర్సిటీ, అక్కడి స్టూడెంట్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version