మెగాస్టార్ చిరంజీవి బాటలో మోహన్​ బాబు.. వాతలు పెట్టుకోవడం ఖాయమేనా?

-

మోహన్ బాబు ఈ ఏడాది ఆరంభంలో ‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడు తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ‘అగ్ని నక్షత్రం’అనే సినిమా చేస్తున్నారు. కాగా, ఇప్పుడాయన కోసం ఓ రీమేక్‌ కథ సిద్ధమైంది. అదే ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు నటుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు.

”ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌’ తెలుగు రీమేక్‌ను వచ్చే ఏడాది జనవరి నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రధాన పాత్రను నాన్న మోహన్‌బాబు పోషిస్తారు. ఆయన తనయుడి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుణ్ని ఎంపిక చేయనున్నాం. ప్రస్తుతం తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా కథలో మార్పులు చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని” చెప్పారు విష్ణు.

అయితే ఇక్కడే ఒక లొసుగు ఉంది, అసలు విషయం ఏమిటంటే 2019వ సంవత్సరంలో మలయాళంలో ఆండ్రాయిడ్ కుంజప్పన్ పాయింట్ టు ఫైవ్ అనే సినిమా విడుదలయి సూపర్ హిట్​గా నిలిచింది. రతీష్ బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో నటించారు. ఇక ఆయన కాకుండా సౌబిన్ షాహిర్, సూరజ్ తేలక్కడ్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో తెలుగులో డబ్బింగ్ అయ్యి ఆహా అలా కూడా రిలీజ్ చేశారు. ఇండియా నుంచి జపాన్ వెళ్లి అక్కడ ఒక రోబోటిక్ కంపెనీలో పనిచేస్తూ ఉండే కొడుకు తన తండ్రి ఆలనా పాలన చూసుకోవడం కోసం తన కంపెనీ తయారు చేసిన రోబోట్ ని భారతదేశం పంపిస్తాడు.

అయితే ముందు దానికి దూరంగానే ఉన్నా కొడుకు దూరమైనా అనే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో ఆ రోబోట్ కి దగ్గరవుతాడు సదరు వృద్ధుడు. ఆసక్తికరమైన కథనంతో సాగే ఈ సినిమా మలయాళం వారినే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో వృద్ధ పాత్రలో తన తండ్రి మోహన్ బాబు నటిస్తారని పేర్కొన్న ఆయన కొడుకు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ పాత్ర తాను మాత్రం చేయడం లేదని చెప్పుకొచ్చారు. తాను చేయకపోవడానికి కూడా కారణం కూడా తన తండ్రి అని అన్నారు. ఆయనతోపాటు నటించడం అంటే చాలా భయంతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చారు. అయితే అసలు రిస్క్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా దాదాపు ఇదే రీతిలో రిలీజ్ అయింది. ఎలా అయితే లూసిఫెర్ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారో ఏఈ ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో కూడా తెలుగులో రిలీజ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అంటే ఒకరకంగా కొంత మార్పులు చేర్పులు చేసుకుని బయటకు వచ్చింది. దీంతో తెలుగు ఆడియన్స్​ను కొంత ఆకట్టుకోగలిగింది. ఇప్పుడు మోహన్ బాబు కనుక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఆ సినిమా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పే ఇప్పుడు మోహన్ బాబు కూడా చేస్తున్నారా? అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో అయితే జోరుగా జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Read more RELATED
Recommended to you

Latest news