ఏపీ రైతులకు సీఎం జగన్‌ మరో శుభవార్త

-

ఏపీ రైతులకు సీఎం జగన్‌ మరో శుభవార్త చెప్పారు. మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటామన్నారు సీఎం జగన్‌. మీ సహాయాన్ని కూడా తీసుకుంటామని.. ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరమని వెల్లడించారు. ప్రతి గ్రామానికీ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యమని.. దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయని తెలిపారు.

కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయని… ఈ సమస్యకు పరిష్కారంకోసం మార్గాన్వేషణ చేశామని ప్రకటన చేశారు.
పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించామని.. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలన్నారు. ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది.. గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చామన్నారు.

అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకేలో పెట్టామని..ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్‌ను, హార్టికల్చర్‌ సంబంధిత గ్రాడ్యుయేడ్‌ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచామని వెల్లడించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌ను కూడా పెట్టామని.. ఆర్డర్‌ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నామని వివరించారు. తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం.. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇ–క్రాపింగ్‌ కూడా చేస్తున్నాం.. జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నామని వెల్లడించారు. ఇ– క్రాపింగ్‌ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news