IRCTC: హైదరాబాద్ నుంచి కోణార్క్ టూర్… ఇలా వీటన్నిటినీ చుట్టేసేయండి..!

-

మీరు ఏదైనా మంచి టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ప్యాకేజీను చూడాలసిందే. కోణార్క్ డ్యాన్స్ అండ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రతీ ఏడాది జరుగుతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

డ్యాన్స్ అండ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనే పేరుతో ఈ ప్యాకేజీని తీసుకు వచ్చారు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ఇది. ఈ టూర్ డిసెంబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో ఉంటుంది. పర్యాటకులు హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో వెళ్లొచ్చు. ఇక టూర్ వివరాలను చూస్తే..

మొదటి రోజు హైదరాబాద్‌లో ఇది స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.10 గంటలకు భువనేశ్వర్ రీచ్ అవుతారు. నెక్స్ట్ హోటల్‌ లో చెకిన్ అయ్యాక.. కోణార్క్ వెళ్ళాలి. చంద్రభాగ బీచ్‌లో సైట్‌సీయింగ్, అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్, కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా చూడొచ్చు. రాత్రికి పూరీ చేరుకుంటారు. రెండో రోజు పూరీలో జగన్నాథ ఆలయాన్ని చూడచ్చు.

చిలికా లేక్ లో బోట్ రైడింగ్ చెయ్యచ్చు. ఐల్యాండ్, ఐరావడ్డీ డాల్ఫిన్ సైట్ వీటన్ని కూడా చూసేయచ్చు. మూడవ రోజు అయితే భువనేశ్వర్ బయల్దేరాలి. అలానే ధౌళీ స్తూపం, లింగరాజ ఆలయం, ముక్తేశ్వర ఆలయం వీటిని చూసేయచ్చు. సాయంత్రం 5.55 గంటలకు భువనేశ్వర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రికి హైదరాబాద్ వచ్చేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news