మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ అరెస్ట్

-

మంచు ఫ్యామిలీలో మూడు రోజుల నుంచి వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.మంచు మనోజ్ పై దాడి కేసులో వెంటక కిరణ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మోహన్ బాబు మేనేజర్,  విష్ణు ప్రధాన అనుచరుడు వెంకట కిరణ్ ను అరెస్ట్ చేశారు పహడి షరీఫ్ పోలీసులు.  మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇక మరో నిందితుడు విజయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

మేనేజర్ కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. సీసీ పుటేజీ, హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లిన విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మనోజ్ పై దాడి జరిగినప్పటి నుంచి విజయ్ కనిపించకపోవడం గమనార్హం. మరోవైపు  మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆస్పత్రికి మంచు మనోజ్ వస్తున్నట్టు సమాచారం రావడంతో ఆస్పత్రికి చేరుకున్నారు రాచకొండ పోలీసులు.  మోహన్ బాబు కుటుంబ వివాదంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎవరు తీసుకెళ్లారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version