హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు !

-

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి మరో నందమూరి హీరో ఎంట్రీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్… మోక్షజ్ఞ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు విచ్చేశారు. నందమూరి మోక్షజ్ఞ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్… నువ్వు స్టార్ హీరోగా మారుతావని తెలిపారు.

Mokshajna’s entry as a hero Junior NTR’s sensational comments

తాత గారి ఆశీస్సులు మోక్షాజ్ఞ పైన ఉండాలని కోరుకుంటున్నాను… అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేయడం జరిగింది. దీంతో… జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి బాలయ్య ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. తమ్ముడి రాకను జూనియర్ ఎన్టీఆర్ వెల్కమ్.. చేయడం హ్యాపీగా ఉందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా నందమూరి మోక్షజ్ఞ… ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా టైటిల్ అలాగే పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఓ పోస్టర్ మాత్రం రిలీజ్ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version