నోట్లో పాము పెట్టుకొని వీడియో.. యువకుడు మృతి

-

సాధారణంగా పాము కనిపిస్తేనే చాలా మంది భయబ్రాంతులకు గురవుతుంటారు. కానీ ఓ యువకుడు పాముతో చెలగాటం ఆడి చివరికీ తన ప్రాణాలను కోల్పోయాడు. నోట్లో పాము పెట్టుకొని సెల్పీ వీడియో తీస్తుండగా.. పాము కాటు వేయడంతో మృతి చెందాడు.  తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 

దేశాయిపేట గ్రామంలో నివాసం ఉండే గంగారాం(47), కుమారుడు మోచి శివరాజ్(20) అనే యువకుడు పాములను పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. తండ్రి గంగారాం ఓ పామును పట్టి కుమారుడికి ఇచ్చాడు. పామును నోట్లో పెట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయమని చెప్పాడు తండ్రి.  ఈ తరుణంలోనే గురువారం శివరాజ్ సుమారు రెండు అంగులాల పొడవు ఉన్నటువంటి నాగుపామును పట్టుకున్నాడు. ఆ విషపు నాగు పామును నోట్లో పెట్టుకొని వీడియో కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ పాము యువకుడి నోట్లోకి విషం చిమ్మించింది. కొద్ది సేపటికే శివరాజ్ ప్రాణాలో కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version