బర్త్ డే స్పెషల్.. హా’య్ నాన్న’ నుంచి మృణాల్ లేటెస్ట్ పోస్టర్

-

టాలీవుడ్ సీత.. అదేనండి మృణాల్ ఠాకూర్.. పుట్టిన రోజు ఇవాళ. ఈ నేపథ్యంలో హాయ్ నాన్న మూవీ టీమ్ మృణాల్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ సినిమా నుంచి ఈ బ్యూటీ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ విషె చేశారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

గిటారు బ్యాగ్ వేసుకుని ఉన్న మృణాళ్‌ పోస్టర్‌ అదిరిపోయింది. ఈ సినిమాలో మృణాళ్‌ గిటార్‌ నేర్పించే టీచర్‌గా కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఫాదర్ డాటర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు. మలయాళ హృదయంతో మ్యూజిక్‌ లవర్స్‌ హృదయాలు కొల్లగొట్టిన అబ్దుల్‌ హేషమ్ వాహబ్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నారు.

మరోవైపు మృణాల్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సెలబ్రిటీలు.. మరోవైపు అభిమానులు మృణాల్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news