ఇద్దరు యువకులు.. కారులో అతి వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లాక వారికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే కారు రూఫ్ టాప్ ఓపెన్ చేశారు. కారు రూఫ్ పైన కూర్చున్నారు. తమ వెంట తెచ్చుకున్న మందు తాగుతూ ఊరంతా తిరిగారు. ఇదంతా వెనక వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. వాళ్లు ఊరుకుంటారా.. విషయం తెలిసిన పోలీసులు ఏం చేశారంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో తమ దృష్టికి రాగానే పోలీసులు రంగంలోకి దిగారు. వారు ప్రయాణించిన కారు నంబర్ సాయంతో వాహనాన్ని ట్రాక్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించినందుకు నిందితులకు రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని మందలించి వదిలేశారు. ఈ విషయాన్ని గాజియాబాద్ డీసీపీ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ऑन रोड कार से स्टंट करते हुए वीडियो हुआ वायरल
ये RDC #गाजियाबाद का वो पॉश इलाका
जहां बड़े बड़े साहबों के मकान है ।लोगो में इतना डर है की , लगातार कार्यवाहियां भी बेअसर है ।@ghaziabadpolice
🙏🇮🇳✍️🙏 pic.twitter.com/ndpU92eXpE— Akash Kumar (@Akashkchoudhary) July 29, 2023