కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలని పూర్తిగా గ్రిప్ లో పెట్టుకుందనే చెప్పాలి. ఏపీలో బిజేపి బలం శూన్యం..కానీ అక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిలతో బిజేపి కావల్సిన రాజకీయం చేసేస్తుంది. ఆ రెండు పార్టీలు కూడా బిజేపికి లొంగి పనిచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే సిబిఐ, ఐటీ దాడులని, కేసులు..రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని చెప్పి జగన్, చంద్రబాబు అసలు బిజేపితో కయ్యం పెట్టుకోవడం లేదు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదు.
కేంద్రంలో ఎలాంటి బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చిన వైసీపీ, టిడిపి మద్ధతు ఇచ్చేస్తున్నాయి. అంటే పరిస్తితి ఎలా ఉందంటే..రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న..బిజేపి ఆధ్వర్యంలోన్ పనిచేయాలి అన్నట్లు పరిస్తితి ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా తమ మాట వినే ప్రభుత్వమే వచ్చేలా బిజేపి రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగో..బిజేపికి అనుకూలంగానే ఉంది. బిజేపిని దాటి జగన్ ఏది చేయరనే పరిస్తితి.
అటు బిజేపితో కయ్యం పెట్టుకుని చంద్రబాబు ఎంత నష్టపోయారో తెలిసిందే. అందుకే మళ్ళీ బిజేపితో కయ్యానికి బాబు సిద్ధంగా లేరు. పైగా బిజేపితో కలవడానికి ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ ఎలాగో బిజేపి మనిషి. అంటే ప్రధాన పార్టీలు మొత్తం బిజేపి అండర్ లోనే ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో టిడిపి-బిజేపి-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
ఇక అధికారంలోకి వస్తే బిజేపి అండర్ లో పనిచేయాల్సిందే. పొరపాటున అధికారంలోకి రాకపోతే టిడిపి దారుణంగా నష్టపోతుంది. కానీ బిజేపికి పోయేదేమీ లేదు. వైసీపీ ఎలాగో బిజేపి అండర్ లోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓ వైపు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉంటూనే..మరోవైపు టిడిపితో పొత్తుకు రెడీ అవుతుంది. మొత్తానికి బిజేపి డబుల్ గేమ్ షురూ చేసింది. అంటే బిజేపికి జగన్ మిత్రుడే..అటు బాబు మిత్రుడే..ఇదే బిజేపి రాజకీయం.