బిగ్‌బాస్‌ సీజన్ 17 విజేతగా మునావర్‌ ఫారూఖీ

-

ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షోకు దేశవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు చూసి ఇతర భాషల్లోనూ ఈ షోను నిర్వహిస్తున్నారు. హిందీలో ఈ షో సీజన్-17 తాజాగా ఫినాలే జరుపుకుంది. బీటౌన్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ హోస్టుగా వ్యవహరిస్తోన్న ఈ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 17’ ఆదివారంతో ముగిసింది.

ఈ సీజన్లో ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్లో గెలవడంతో ఓ కారుతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిగా అందుకున్నాడు. ఈ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని మునావర్ హర్షం వ్యక్తం చేశాడు. తనకు సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇక ఈ సీజన్లో రన్నరప్గా నటుడు అభిషేక్‌ కుమార్‌ నిలిచాడు.

మొత్తం 107 రోజులపాటు సాగిన ఈ సీజన్లో కొరియన్ పాప్ సింగర్ ఔరా కూడా సందడి చేశాడు. 21 మంది సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఇందులో నీల్-ఐశ్వర్య.. అంకితా లోఖండే, విక్కీజైన్‌ జోడీ అందరి దృష్టిని ఆకర్షించింది.

Read more RELATED
Recommended to you

Latest news