సూపర్ స్టార్ తో మురుగదాస్..?

-

అదేంటి ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ తీసిన స్పైడర్ రిజల్ట్ చూశాక కూడా మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎందుకని అనుకుంటున్నారు కావొచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగు సూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ సినిమా తీశాడు కాని తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ తో మాత్రం ఇంకా ఛాన్స్ అందుకోలేదు.

కొన్నాళ్లుగా రజిని సినిమా కోసం ట్రై చేస్తున్నా సరైన కథ సెట్ అవట్లేదు. కాలా తర్వాత సినిమాల స్పీడ్ పెంచిన రజినికాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో పెట్ట మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే రజినికి లైన్ చెప్పి ఒప్పించాడట మురుగదాస్.

తమిళ ఆడియెన్స్ కు మాత్రం ఈ కాంబినేషన్ ఓ పెద్ద పండుగ అన్నట్టే. ప్రెజెంట్ మురుగదాస్ తమిళ స్టార్ హీరో విజయ్ తో సర్కార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా కోలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version