ఈ వారం రోల్ రైడా ఎక్సిట్ కన్ఫామా..!

-

స్టార్ మా ప్రెస్టిజియస్ రియాలిటీ షో బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక మరో వారం మాత్రమే ఉన్న ఈ సీజన్ ఫైనల్ విన్నర్ ఎవరన్నది మాత్రం గెస్ చేయలేకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆరుగురు కంటెస్టంట్స్ ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు.

అసలైతే ఇంటి సభ్యులంతా నామినేషన్ లో ఉండగా టికెట్ ఫినాలే గెలిచిన సామ్రాట్ నామినేషన్ నుండి తప్పించుకున్నడు. అయితే మిగిలిన ఐదుగురిలో కౌశల్, దీప్తి, గీతా మాధురి, తనీష్ సేఫ్ అయినా రోల్ రైడా ఈ వారం బిగ్ బాస్ హౌజ్ వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. శనివారం ఎపిసోడ్ ముగిసే సరికి ఎవరిని సేఫ్ జోన్ లోకి పంపించలేదు నాని.

దాదాపుగా ఆదివారం రోల్ రైడా ఎలిమినేషన్ పక్కా అంటున్నారు. ఇక కౌశల్ తో పాటుగా దీప్తి, గీతా, తనీష్ లు కూడా ఫైనల్స్ కు వెళ్తారని తెలుస్తుంది. మరి రేపు ఏం జరుగబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version