మైత్రీ మూవీస్ ఇక భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించదా ..?

-

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో మొదటిగా తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు శృతిహాసన్ జంటగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. అప్పటి నుంచి వరసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలు రికార్డ్స్ క్రియోట్ చేశాయి. దాంతో పెద్ద నిర్మాణ సంస్థ గా పేరు సంపాదించుకుంది. కాని తర్వాత వచ్చిన సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని, డియర్ కామ్రేడ్, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి.

 

అయినా ఈ సంస్థలో స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు నిర్మించడానికి డేట్స్ లాక్ చేసి అడ్వాన్స్ ఇచ్చి పెట్టింది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఎన్.టి.ఆర్, ప్రభాస్, కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుకుమార్, త్రివిక్రం, కొరటాల శివ ..ఇలాంటి లిస్ట్ ఉంది. ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా మైత్రీ మూవీ మేకర్స్ లోనే నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం …ఇలా మొత్తం అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది.

అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా ఏర్పడిన ఆర్ధిక మాంద్యం తో ఇప్పట్లో ఈ కాంబినేషన్ ఉండబోదని సమాచారం. అంతేకాదు ఒకేసారి రెండు మూడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి సిద్దంగా లేరట. దీన్ని బట్టి ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మరో ఇప్పట్లో ఉండదని అంటున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమాని త్రివిక్రం తో చేయనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version