నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి రష్మిక ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు రష్మికపై ఇలాంటి వీడియోలు చేసి ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు.
దీనిపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక అటు రష్మిక డీప్ ఫేక్ వీడియోపై హీరో నాగచైతన్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చూస్తే నిరుత్సాహం కలుగుతోంది. భవిష్యత్తులో రాబోయే మార్పులను గుర్తు చేసుకుంటే భయమేస్తోంది. దాని బాధితులకు రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలి. కొత్త చట్టాన్ని తీసుకురావాలి. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ అంతకుముందు రష్మిక చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేశారు. దీనికి రష్మిక ‘థ్యాంక్యు’ అని రిప్లై ఇచ్చారు.