విజయవాడ బస్టాండ్‌లో ప్రమాదం.. CCTV ఫుటేజీ విడుదల

-

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ కండక్టర్, ఒక మహిళా ప్రయాణికురాలు, మరో చిన్నారి మృతి చెందారు. అటు పలువురికి గాయాలు అయ్యాయి. అయితే.. తాజాగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రమాదం సంఘటనకు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో బస్సు ముందుకు ఎలా వెళ్లింది..అసలు ప్రమాదానికి కారణాలు ఏంటనే దానిపై క్లారిటీగా కనిపించింది.

Accident at Vijayawada bus stand, CCTV footage

ఇది ఇలా ఉండగా.. విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్… మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని… ఘటన పై విచారణకు ఆదేశించారు సీఎం జగన్‌. అటు బస్సు ప్రమాదం దురదృష్టకరం అని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. గాయపడిన వారికి మంచి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news