హీరో దర్శన్‌కు మద్దతు ఇచ్చిన తెలుగు హీరో నాగశౌర్య

-

Naga Shaurya’s Blunder Will Haunt Him For Ever:  హీరో దర్శన్‌కు మద్దతు ఇచ్చారు తెలుగు హీరో నాగశౌర్య. అభిమానిని హత్య చేసిన విషయంలో కన్నడ హీరో దర్శన్‌కు మద్దతు ఇచ్చారు తెలుగు హీరో నాగశౌర్య. దర్శన్ అన్న ఎవరికి హాని చేయని వ్యక్తి.. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందని తెలిపారు.

Naga Shaurya’s Blunder Will Haunt Him For Ever

తొందరలోనే నిజం బయటకి వస్తుందని దర్శన్‌కు మద్దతు తెలిపారు నాగశౌర్య. అయితే…. తెలుగు హీరో నాగశౌర్య చేసిన పోస్ట్‌ కు నెటిజన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. హత్య చేసిన వాడు ఎలా బయటకు వస్తాడని నిలదీస్తున్నారు.

కాగా, అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కన్నడ హీరో దర్శన్…ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపాడట. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేశాడట దర్శన్.

Read more RELATED
Recommended to you

Latest news