చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త

-

 

Woman kills daughter-in-law for refusing to serve tea: హైదరాబాద్‌ మహా నగరంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. అయితే.. తాజాగా చాయ్ పెట్టలేదని కోడలిని చంపింది ఓ అత్త. ఈ సంఘటన హైదరాబాద్‌ లోనే జరిగింది ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Woman kills daughter-in-law for refusing to serve tea

చాయ్‌ పెట్టే విషయంలో గొడవ జరిగి కోడలిని అత్త హత్య చేసింది. అత్తాపూర్‌‌లోని హసన్‌నగర్‌లో అజ్మీరాబేగం, అబ్బాస్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి అజ్మీరాబేగం, అత్త ఫర్జానాబేగంల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న(గురువారం) చాయ్‌పెట్టాలని అత్త కోడలిని ఆదేశించింది. ఆమె పెట్టకపోవడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో ఫర్జానాబేగం తన కోడలికి చున్నీ బిగించి హత్య చేసింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news