ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం.. రంగంలోకి రామ్మోహన్నాయుడు

-

ఢిల్లీ ఎయిర్ పోర్టులో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు….T1 ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. T1 వద్ద ఉన్న బాధిత ప్రయాణికులందరికీ సాయం చేయాలని ఆదేశించామని… ఈ మేరకు వివిధ విమానయాన సంస్థలకు ఆదేశించామని పేర్కొన్నారు.

Union Minister Rammohan Naidu reacts to the incident of terminal roof collapse at Delhi Airport

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు..మొత్తం జలమయమయ్యాయి. దీంతో నిన్నటి నుంచి ఢిల్లీలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కార్లు, బైకులు…పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. అటు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలింది రూఫ్. ఇక ఆ ఎయిర్‌ పోర్టు రూఫ్ కూలడంతో కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. దీంతో బాధితులను ఎయిర్‌పోర్టు మేదాంతకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news